కియా నుంచి కొత్త కారు.. డీజిల్, హైబ్రిడ్, ఏడబ్ల్యూడీతో అదిరిపోయే ఎస్‌యూవీ
- కియా సొరెంటో ప్రారంభ ధర రూ.27.99 లక్షలు
- అందుబాటులో డీజిల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు
- హైబ్రిడ్ వెర్షన్‌తో 238 హెచ్‌పీ శక్తి
- డీజిల్ ఇంజిన్ 193 హెచ్‌పీ పవర్
- ఆరు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లు
కియా ఇండియా కొత్తగా సోరెంటో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.27.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్). సెల్టోస్‌కు పైన ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. భారత్‌లో కియా విక్రయించే ఫ్లాగ్‌షిప్ ఐసీఈ ఎస్‌యూవీగా సోరెంటో నిలిచింది. టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్‌వ్యాగన్ టైరాన్‌తో ఇది పోటీపడనుంది.
సోరెంటో పొడవు 4,815 మి.మీ., వెడల్పు 1,900 మి.మీ., ఎత్తు 1,785 మి.మీ. వీల్‌బేస్ 2,815 మి.మీ. సెగ్మెంట్‌లో పొడవైన, వెడల్పైన మోడల్‌గా కియా చెబుతోంది. నిలువుగా ఉండే హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్స్, టైగర్ నోస్ గ్రిల్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, నిలువు టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి. మొత్తం 8 రంగుల్లో లభిస్తుంది. ఆల్-బ్లాక్ ఆప్షన్ కూడా ఉంది.
లోపల 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. వేరియంట్‌ను బట్టి 4 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లేదా 12.3 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే వస్తుంది. టాప్ వేరియంట్లలో కియా కనెక్ట్ 2.0, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్‌ప్లే, జనరేటివ్ ఏఐ అసిస్టెంట్ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, బోస్ 12-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్ కూడా ఉన్నాయి.
ఏడుగురు ప్రయాణించేందుకు మూడు వరుసల సీటింగ్ ఉంటుంది. ఆరు సీట్ల ఆప్షన్ కూడా ఉంది. భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగులు, 26 ఫీచర్ల సేఫ్టీ ప్యాకేజీ ఇచ్చారు. టాప్ వేరియంట్లో 10 ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2+ ఏడీఏఎస్, సరౌండ్ వ్యూ మానిటర్, రిమోట్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కియా ఇండియా సోరెంటోలో తొలిసారి స్ట్రాంగ్ హైబ్రిడ్, ఆల్ వీల్ డ్రైవ్ కలిపి అందిస్తోంది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన హైబ్రిడ్ 238 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది. 265 ఎన్ఎం టార్క్ ఉంటుంది. డీజిల్ వెర్షన్‌లో 2.2 లీటర్ ఇంజిన్ 193 హెచ్‌పీ, 442 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. దిగువ వేరియంట్లలో ఫ్రంట్ వీల్ డ్రైవ్, టాప్ హెచ్‌టీఎక్స్‌లో ఆల్ వీల్ డ్రైవ్ అందుబాటులో ఉంటుంది.