కొత్త పీసీ కొనాల్సిన పనిలేదు.. రూ.1,000కే 16జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌

Reliance Jio No need to buy a new PC 16GB RAM and 1TB storage for 1000 rupees
  • ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌గా అందుబాటులోకి జియోపీసీ
  • ఏ ఇంటర్నెట్‌ కనెక్షన్‌తోనైనా సేవ
  • గరిష్ఠంగా 16జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌
  • స్టాండర్డ్‌ ప్లాన్‌ ధర రూ.1,000
  • అల్ట్రా ప్లాన్‌ రెండు నెలలకు రూ.1,200
పాత కంప్యూటర్‌ నెమ్మదిగా పనిచేస్తోందా? కొత్త సాఫ్ట్‌వేర్‌ వాడాలంటే మీ పీసీ సరిపోవడం లేదా? అయితే కొత్త కంప్యూటర్‌ కొనాల్సిన అవసరం లేకుండా క్లౌడ్‌ ద్వారా మెరుగైన కంప్యూటింగ్‌ సదుపాయాలు పొందేలా రిలయన్స్‌ జియో జియోపీసీని విస్తరించింది. ఇప్పటివరకు జియోహోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవను ఇప్పుడు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌గా తీసుకొచ్చింది. ఏ టెలికాం లేదా బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నా జియోపీసీను ఉపయోగించుకోవచ్చు.

జియోపీసీ ద్వారా ఇప్పటికే ఉన్న కంప్యూటర్‌లోనే గరిష్ఠంగా 16జీబీ ర్యామ్‌, 1టీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ పొందొచ్చు. ముఖ్యంగా మూడు, నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసిన పాత పీసీలు నెమ్మదించినా, స్టోరేజ్‌ తక్కువైనా ఈ సేవ ఉపయోగపడుతుందని జియో చెబుతోంది. ఎనిమిదేళ్ల నాటి కంప్యూటర్‌లోనూ క్లౌడ్‌ ద్వారా ఏఐ ఆధారిత అప్లికేషన్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

జియోపీసీలో ప్రస్తుతం రెండు ప్లాన్లు ఉన్నాయి. స్టాండర్డ్‌ ప్లాన్‌లో 8జీబీ ర్యామ్‌, 500జీబీ స్టోరేజ్‌ లభిస్తాయి. రెండు నెలలకు రూ.1,000, ఐదు నెలలకు రూ.2,000 చెల్లించాలి. 10+2 నెలల ప్లాన్‌ ధర రూ.4,000గా ఉంది.

జియోపీసీ అల్ట్రా ప్లాన్‌లో 16జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ లభిస్తాయి. రెండు నెలలకు రూ.1,200, ఐదు నెలలకు రూ.2,500, 10+2 నెలలకు రూ.5,000 చెల్లించాలి.

క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే సేవ కావడంతో స్థిరమైన ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం. బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు 4జీ, 5జీ కనెక్షన్లపైనా జియోపీసీ పనిచేస్తుందని జియో తెలిపింది. కొత్త హార్డ్‌వేర్‌ కొనాల్సిన అవసరం లేకుండా ఐదు నిమిషాల్లోపు సెటప్‌ చేసుకోవచ్చని పేర్కొంది. డేటాను మరో కంప్యూటర్‌కు మార్చాల్సిన అవసరం కూడా ఉండదు.

జియో తొలిసారిగా 2025 జూలైలో జియోఫైబర్‌, జియో ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారుల కోసం జియోపీసీని తీసుకొచ్చింది. అప్పట్లో జియో సెటాప్‌ బాక్స్‌, కీబోర్డ్‌, మౌస్‌ ద్వారా క్లౌడ్‌ ఆధారిత Ubuntu పీసీని ఉపయోగించుకునే అవకాశం ఉండేది. 8జీబీ ర్యామ్‌, 100జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌తో పాటు కొన్ని ఏఐ టూల్స్‌ కూడా అందించేవారు. తాజా మార్పులతో జియోపీసీకి జియో బ్రాడ్‌బ్యాండ్‌, సెటాప్‌ బాక్స్‌ అవసరం లేకుండా పోయింది.
Advertisement
Reliance Jio
JioPC Cloud PC
Cloud Computing Service
JioPC Subscription Plans
16GB RAM 1TB Storage
Old PC Performance Boost

More Telugu News