‘కల్కి’ సినిమాలో ఆఫర్ అంటూ ప్రచారం.. చిత్ర బృందం కీలక హెచ్చరిక
- ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై ‘కల్కి’ మేకర్స్ హెచ్చరిక
- థర్డ్ పార్టీ కాస్టింగ్ ఏజెన్సీలకు అనుమతి లేదని స్పష్టీకరణ
- వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని సూచన
- ఆడిషన్ మెటీరియల్ పంపొద్దని హెచ్చరిక
- ఎవరికి డబ్బులు చెల్లించొద్దని విజ్ఞప్తి
‘కల్కి 2898 ఏడీ’ సినిమా పేరుతో జరుగుతున్న నకిలీ కాస్టింగ్ కాల్స్‌పై చిత్రబృందం అప్రమత్తం చేసింది. తమ ప్రతినిధులమంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు ఆడిషన్స్, కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి వారిని నమ్మొద్దని ప్రజలను కోరింది.
ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ గురువారం సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన విడుదల చేసింది. తాము ఎలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ, కంపెనీ, వ్యక్తి లేదా కాస్టింగ్ ప్రతినిధిని ఆడిషన్స్, కాస్టింగ్ కోసం నియమించలేదని స్పష్టం చేసింది.
తమ పేరుతో ఎవరైనా కాస్టింగ్ అవకాశాలు కల్పిస్తామంటూ సంప్రదిస్తే వ్యక్తిగత వివరాలు, ఆడిషన్ మెటీరియల్ ఇవ్వొద్దని మేకర్స్ సూచించారు. ముఖ్యంగా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని హెచ్చరించారు. తమ సంస్థ పేరును అనధికారికంగా ఉపయోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు.
‘కల్కి 2898 ఏడీ’కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం వైజయంతీ మూవీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే నమ్మాలని చిత్రబృందం సూచించింది.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితర అగ్ర తారలు నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ విజయం సాధించిన తొలి భాగం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా అవార్డు రావడంతో పాటు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ విభాగంలోనూ పురస్కారం లభించింది.