Advertisement

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @ 24,055

Stock markets end in slight losses Nifty at 24055
  • వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
  • 12.99 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్‌
  • 24.60 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
  • బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి
  • 1.39 శాతం పడిపోయిన మిడ్‌క్యాప్‌ సూచీ
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ, హెల్త్‌కేర్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి.

సెన్సెక్స్‌ 12.99 పాయింట్లు నష్టపోయి 76,944.28 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 24.60 పాయింట్లు తగ్గి 24,055.80 వద్ద ముగిసింది. 

నిఫ్టీకి 24,150-24,200 స్థాయి కీలక నిరోధంగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 24,200 పైన నిలకడగా ట్రేడైతే 24,300-24,400 స్థాయుల దిశగా పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు పైస్థాయుల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందన్నారు.

మరోవైపు నిఫ్టీ 24,000 దిగువన నిలకడగా కొనసాగితే 23,900-23,800 ప్రాంతానికి పడిపోయే అవకాశముందని విశ్లేషకులు పేర్కొన్నారు.

నిఫ్టీలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌, మారుతి సుజుకి ఇండియా, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు అధికంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 1.39 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.23 శాతం క్షీణించాయి.

రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్‌, ఆటో, రియల్టీ, ఫార్మా సూచీలు వెనుకబడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ సూచీలు మాత్రం మెరుగ్గా రాణించి మార్కెట్‌కు కొంత మద్దతు ఇచ్చాయి.

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు పెరిగాయని నిపుణులు తెలిపారు. సమీప కాలంలో ఇంధన మార్కెట్ల పరిణామాలు, ప్రపంచ వడ్డీ రేట్లపై అంచనాలు, వర్ధమాన దేశాల్లోకి పెట్టుబడుల ప్రవాహం మార్కెట్‌ దిశను నిర్ణయించే అవకాశం ఉందన్నారు.
Advertisement
Indian Stock Market
Sensex
Nifty 50
US Iran tensions
Shriram Finance
Maruti Suzuki

More Telugu News