ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం.. రాష్ట్రవ్యాప్తంగా 'సంజీవని' అమలు: సీఎం చంద్రబాబు
- అల్లూరి జిల్లాలో ఆరోగ్య రథాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ కార్యక్రమం అమలుకు నిర్ణయం
- మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం సెల్ టవర్ల ఏర్పాటు
- ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్న సీఎం
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఒక పటిష్ఠమైన వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 'సంజీవని' కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు అరకులోయ మండలం గన్నెలలో ఆయన పర్యటించి, పలు 'ఆరోగ్య రథాల'ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ముంగిటకే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొండ ప్రాంతాల్లోని ప్రజలు వైద్యం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన దుస్థితి ఉండకూడదన్నదే తన సంకల్పమని ఉద్ఘాటించారు. ఈ సమస్యను అధిగమించేందుకే 'సంజీవని' కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్య సేవలతో పాటు కనెక్టివిటీకి కూడా తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ
తంలోనే అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంత గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించారని గుర్తుచేశారు. ఆ మహనీయుడిని నిత్యం స్మరించుకునేందుకే భోగాపురంలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. గిరిజన బిడ్డలు థింసా నృత్యంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.