టెక్నాలజీతో తెలుగుకు కొత్త వెలుగు.. ‘Coolphabets’ యాప్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
- తెలుగు భాష, లిపిని భావితరాలకు సజీవంగా అందించాలని చంద్రబాబు పిలుపు
- డిజిటల్ యుగంలో పిల్లలకు తెలుగు రాయడం నేర్పించాలని సూచన
- తెలుగు నేర్పించే ‘కూల్‌ఫబెట్స్’ యాప్ రూపకర్తలను ప్రత్యేకంగా అభినందించిన సీఎం
- ఏఐ టెక్నాలజీతో చేతిరాతను మెరుగుపరిచేలా యాప్ రూపకల్పనపై హర్షం
- సాంకేతికత భాషను దూరం చేయకూడదు, దగ్గర చేయాలని వ్యాఖ్య
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష గొప్పదనాన్ని భావితరాలకు సజీవంగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాటల్లోనే కాదు, అక్షరాల్లోనూ తెలుగు భాష వైభవం తరతరాలకు నిలవాలని ఆయన ఆకాంక్షించారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు తెలుగు చదవడం, రాయడంపై ఆసక్తి పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
చిన్నతనం నుంచే పిల్లల్లో అక్షరంపై మమకారం, భాషపై అభిమానం పెంచితేనే మన తెలుగు లిపి భవిష్యత్తులోనూ వెలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘కూల్‌ఫబెట్స్’ (Coolphabets) యాప్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటపాటల ద్వారా పిల్లలకు తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే ఈ యాప్‌ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ యాప్ రూపకర్తలైన కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటితో పాటు వారి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ యాప్‌లో వినియోగించిన సాంకేతికతను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ సహాయంతో పిల్లల చేతిరాతను పరిశీలించి, దాన్ని మెరుగుపరచడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్‌ను తీర్చిదిద్దడంపై హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికత మన భాషను దూరం చేయకూడదని, దానికి మరింత చేరువ చేసే సాధనంగా మారాలని సూచించారు.
"మన భాష, మన లిపి, మన సంస్కృతే మన తెలుగు జాతికి అసలైన గుర్తింపు. తేనెలొలికే మన తెలుగు భాష, భావితరాల్లోనూ చిరస్థాయిగా వెలుగొందాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పోస్టులో ఆకాంక్షించారు. సాంకేతికతను భాషాభివృద్ధికి వాడుకోవాలన్న ఆయన పిలుపుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.