150 రోజుల్లోనే బాలేన్ షాకు చుక్కలు.. ప్రధానిపై యువత ఆగ్రహం
- 150 రోజులకే సంక్షోభంలో నేపాల్ ప్రధాని బాలేన్ షా
- రాజీనామా చేయాలంటూ ఖాట్మాండ్‌లో యువత ఆందోళనలు
- యువకుడి ఆత్మాహుతితో తీవ్రరూపం దాల్చిన నిరసనలు
- పార్లమెంటుకు గైర్హాజరు, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత
నేపాల్ రాజకీయాల్లో సంచలన విజయంతో అధికార పీఠాన్ని అధిష్టించిన ప్రధానమంత్రి బాలేన్ షా, పదవి చేపట్టిన 150 రోజుల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఏ యువత మద్దతుతో ఆయన ఘన విజయం సాధించారో, ఇప్పుడు అదే యువత ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తుతూ వీధుల్లోకి రావడం గమనార్హం. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలంటూ ఖాట్మాండ్‌లోని మైతీఘర్ మండలా ప్రాంతం ఆందోళనలతో దద్దరిల్లుతోంది.
ఈ ఏడాది మార్చి 5న జరిగిన ఎన్నికల్లో బాలేన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) 275 స్థానాలకు గాను 182 సీట్లు గెలుచుకుని రాజకీయ ప్రభంజనం సృష్టించింది. అయితే, ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే పాలనపై అసంతృప్తి మొదలైంది. ఇటీవల గణేష్ నేపాలీ అనే 25 ఏళ్ల రైడ్ షేర్ డ్రైవర్ తన వాహన వివాదం నేపథ్యంలో పాస్‌పోర్ట్ కార్యాలయం ముందు ఆత్మాహుతికి పాల్పడటంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఘటనతో ప్రభుత్వ వైఖరిపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
వీధుల్లోనే కాకుండా పార్లమెంటులోనూ బాలేన్ షా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం 39 పార్లమెంట్ సమావేశాలకు గాను ఆయన కేవలం ఐదు సార్లు మాత్రమే హాజరుకావడంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 26న సభకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ఆయన్ను ఆదేశించారు. మరోవైపు, భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ నిబంధనలు కఠినతరం, సరిహద్దు వివాదాలపై వ్యాఖ్యలు, అగ్నిపథ్ పథకం వంటి అంశాలు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి.
ఈ సంక్షోభానికి తోడు సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలేన్ షా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ నేతలను సమన్వయం చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. "కేవలం ప్రధాని గౌరవాన్ని కాపాడితే ప్రభుత్వం మనుగడ సాగించదు. సభ్యుల గౌరవాన్ని కూడా కాపాడాలి" అని ఆర్ఎస్పీ ఎంపీ జగదీష్ ఖరేల్ పార్లమెంటులోనే బాహాటంగా వ్యాఖ్యానించడం పార్టీలోనే అసమ్మతికి అద్దం పడుతోంది. మొత్తానికి 'జెన్-జెడ్' మద్దతుతో అధికార పీఠమెక్కిన బాలేన్ షా సర్కార్, కేవలం ఐదు నెలల్లోనే పెను సంక్షోభంలో కూరుకుపోయింది.