ఇండియాలోనే తొలి ఈ85 స్కూటర్‌.. హోండా నుంచి రెండు అదిరిపోయే కొత్త మోడళ్లు

Honda launches two new models price and features revealed
  • హోండా ఏడీవీ160, రెబల్‌ 300 భారత మార్కెట్లో విడుదల
  • ఏడీవీ160 ధర రూ.1.70 లక్షలుగా నిర్ణయం
  • రెబల్‌ 300 ప్రారంభ ధర రూ.2.22 లక్షలు
  • ఏడీవీ160 భారత్‌లో తొలి ఈ85 ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ స్కూటర్‌
  • అక్టోబర్‌ నుంచి డెలివరీలు ప్రారంభం
ప్రీమియం వాహన విభాగంలో హోండా జోరు పెంచింది. భారత మార్కెట్లో ఏడీవీ160 స్కూటర్‌, రెబల్‌ 300 క్రూయిజర్‌ బైక్‌ను విడుదల చేసింది. ఏడీవీ160 ధరను రూ.1.70 లక్షలుగా నిర్ణయించగా.. రెబల్‌ 300 ప్రారంభ ధర రూ.2.22 లక్షలుగా ప్రకటించింది. అక్టోబర్‌ మధ్య నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఏడీవీ160ను అడ్వెంచర్‌ స్టైల్‌ మ్యాక్సీ స్కూటర్‌గా తీసుకొచ్చింది హోండా 156.9 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఇందులో ఉంది. గరిష్ఠంగా ఈ85 ఇంధన మిశ్రమంతో నడిచే భారత్‌లో తొలి ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ స్కూటర్‌గా దీన్ని హోండా పేర్కొంది. 27 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, రోడ్‌సింక్‌, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా రెబల్‌ 300 మాత్రం క్రూయిజర్‌ బైక్‌ ప్రియులను లక్ష్యంగా తీసుకొచ్చింది. బాబర్‌ స్టైల్‌ డిజైన్‌, తక్కువ ఎత్తులో సీటింగ్‌, బ్లాక్డ్‌-అవుట్‌ లుక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 286 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది.

స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ.2.22 లక్షలు కాగా.. ఈ-క్లచ్‌ వేరియంట్‌కు రూ.2.62 లక్షలుగా నిర్ణయించారు. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌, టీఎఫ్‌టీ క్లస్టర్‌, హోండా రోడ్‌సింక్‌, నావిగేషన్‌, డ్యూయల్‌-ఛానల్‌ ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ రెండు మోడళ్ల బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.5,000 చెల్లించి హోండా వెబ్‌సైట్‌, అధీకృత రెడ్‌వింగ్‌, బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌లలో బుక్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ మధ్య నుంచి వినియోగదారులకు వాహనాల డెలివరీలు అందనున్నాయి.
  
Advertisement
Honda
Honda ADV160
Honda Rebel 300
Honda India New Launches
Honda ADV160 Price
Honda Rebel 300 Features

More Telugu News