అమెరికా చదువుపై భారత విద్యార్థుల్లో తగ్గుతున్న ఆసక్తి

Indian students interest in US education declining
  • అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు భారత విద్యార్థుల విముఖత
  • గత ఏడాదితో పోలిస్తే 15 శాతం తగ్గిన దరఖాస్తులు
  • ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానాలే ప్రధాన కారణం
  • చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలపై నెలకొన్న అనిశ్చితి
అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు భారతీయ విద్యార్థులు విముఖత చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైంది.

2024-25 విద్యా సంవత్సరంలో సుమారు 3.63 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ యూజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొదారు. అయితే, తదుపరి విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం భారతీయ విద్యార్థులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కూడా సుమారు 1.1 లక్షల మేర క్షీణించింది. అంచనాల ప్రకారం 11.69 లక్షలుగా ఉండాల్సిన ఈ సంఖ్య, ప్రస్తుతం 10.57 లక్షలకు పరిమితమైంది.

భారత విద్యార్థులలో కనిపిస్తున్న ఈ విముఖతకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానాలే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వీసాల జారీలో కఠిన నిబంధనలు, సామూహిక అరెస్టులు, బహిష్కరణలు, సోషల్ మీడియా ఖాతాల పరిశీలన వంటి అంశాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలపై నెలకొన్న అనిశ్చితి కూడా వారిని పునరాలోచనలో పడేస్తోంది.

ఇదే తరుణంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్-1బీ వీసాలపై విధించిన కొత్త రుసుములను సమర్థించారు. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా, అమెరికన్ కంపెనీలు స్థానికులకే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement
Indian Students
US Education
Donald Trump
H1B Visa
JD Vance

More Telugu News