దుబాయ్‌లో పిన్‌కోడ్ వ్యవస్థ ఉండదు.. మరి పార్సిళ్లు ఎలా చేరుతాయి?
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా లేని పిన్‌కోడ్ వ్యవస్థ
- చిరునామా వివరాలతోనే పార్సిళ్ల డెలివరీ
- పేరు, భవనం, ఫ్లాట్, ఫోన్ నంబర్ కీలకం
- పీవో బాక్స్ వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యం
- జిప్ కోడ్ తప్పనిసరైతే 00000 ఇవ్వొచ్చు
దుబాయ్‌లో ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే.. మన దగ్గరిలా పిన్‌కోడ్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే అక్కడ ప్రాంతాల వారీగా పోస్టల్ కోడ్ వ్యవస్థ లేదు. అయినా ఉత్తరాలు, పార్సిళ్లు, ఆన్‌లైన్ ఆర్డర్లు మాత్రం సులభంగానే గమ్యానికి చేరుతాయి. అసలు పిన్‌కోడ్ లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుందన్నదే ఆసక్తికరం.
దుబాయ్‌తో పాటు యూఏఈలోనూ సాధారణ పోస్టల్ సేవలకు ప్రాంతాల వారీగా కోడ్‌లు ఉపయోగించరు. చిరునామాను గుర్తించేందుకు పేరు, భవనం, వీధి, ఫ్లాట్ లేదా యూనిట్ నంబర్, ఎమిరేట్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఉపయోగిస్తారు. పీవో బాక్స్ వ్యవస్థ కూడా అక్కడ పోస్టల్ సేవల్లో కీలకంగా మారింది. దుబాయ్‌లో నివాసితులు, వ్యాపార సంస్థలు పోస్టాఫీసులో తమ పేరుతో ప్రత్యేక బాక్స్ తీసుకోవచ్చు. ఉత్తరాలు, పార్సిళ్లు ఆ బాక్స్‌కు చేరుతాయి. వాటిని అక్కడి నుంచి తీసుకోవచ్చు.
ఆన్‌లైన్ ఆర్డర్ చేస్తే..
దుబాయ్‌కి పర్యటనకు వెళ్లినప్పుడు హోటల్‌కు ఏదైనా ఆర్డర్ చేస్తే.. హోటల్ పేరు, గది నంబర్, పూర్తి చిరునామా, మీ పేరు, ఫోన్ నంబర్ స్పష్టంగా ఇవ్వాలి. ఆర్డర్ పెట్టే ముందు హోటల్ నుంచి డెలివరీకి అవసరమైన వివరాలు తెలుసుకోవడం మంచిది.
జిప్‌కోడ్ తప్పనిసరి అయితే?
ఇక్కడే మరో ఆసక్తికర విషయం ఉంది. కొన్ని వెబ్‌సైట్లు జిప్ కోడ్ లేకుండా ఆర్డర్ పూర్తి చేయనివ్వవు. అలాంటి చోట 00000ను నమోదు చేయొచ్చు. అక్షరాలను అనుమతించే సైట్లలో N/A లేదా Not Applicable అని ఇవ్వవచ్చు.
పార్సిల్ పంపిన తర్వాత దాని కదలికను తెలుసుకునేందుకు పోస్టల్ ట్రాకింగ్ నంబర్ ఉపయోగపడుతుంది. అంటే.. దుబాయ్‌లో పిన్‌కోడ్ లేకపోయినా డెలివరీ వ్యవస్థకు ఇబ్బంది లేదు. అక్కడ సరైన చిరునామా, ఫోన్ నంబర్ కీలకం.