పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే మెషీన్లు నిజంగా పనిచేస్తాయా? సైన్స్ ఏం చెబుతోంది?
- బెల్లీ ఫ్యాట్ మెషీన్లతో కొవ్వు కరగడం అనుమానమే
- శరీరంలోని ఒక్క ప్రాంతం కొవ్వును మాత్రమే తగ్గించలేం
- ఈఎంఎస్ బెల్టులు కండరాలను మాత్రమే కదిలిస్తాయి
- వైబ్రేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం చాలా స్వల్పం
- సౌనా బెల్టులు నీటిని మాత్రమే తగ్గిస్తాయి
బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తామంటూ మార్కెట్లోకి వస్తున్న వైబ్రేటింగ్ బెల్టులు, ఈఎంఎస్ బెల్టులు, సౌనా బెల్టులు, వైబ్రేషన్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదరణ పెరుగుతోంది. వ్యాయామం చేయకుండానే పొట్ట కొవ్వు తగ్గుతుందని వీటి ప్రకటనలు చెబుతున్నాయి. అయితే ఇవి నిజంగా కొవ్వును కరిగిస్తాయా? లేక కేవలం మార్కెటింగ్ మాత్రమేనా?
సైన్స్ ప్రకారం.. పొట్ట దగ్గర ఉన్న కొవ్వును మాత్రమే లక్ష్యంగా చేసుకుని కరిగించడం సాధ్యం కాదు. దీన్నే ‘స్పాట్ రిడక్షన్’ అంటారు. శరీరం కొవ్వును వినియోగించేటప్పుడు ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచే కొవ్వును తీసుకోదు. శరీరంలోని వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉన్న కొవ్వు ఎనర్జీ అవసరాలకు అనుగుణంగా ఖర్చవుతుంది.
ఈఎంఎస్ బెల్టులు ఏం చేస్తాయి?
ఈఎంఎస్ అంటే ‘ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్’. ఈ పరికరాలు విద్యుత్ సంకేతాల ద్వారా పొట్ట కండరాలను సంకోచించేలా చేస్తాయి. దీంతో కండరాలు పనిచేసినట్లు అనిపించవచ్చు. కానీ అది పొట్టలోని కొవ్వు కరిగిపోతుందని అర్థం కాదు. క్లినికల్ పరిశోధనల్లోనూ ఈఎంఎస్ ద్వారా పొట్టలోని కొవ్వు కణాలు గణనీయంగా తగ్గుతాయని బలమైన ఆధారాలు కనిపించలేదు.
వైబ్రేషన్ ప్లాట్‌ఫారమ్‌ల పరిస్థితి?
వైబ్రేషన్ ప్లాట్‌ఫారమ్‌లపై నిలబడితే కండరాలల్లో చిన్న చిన్న సంకోచాలు ఏర్పడతాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయని, ఫలితంగా కొవ్వు తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే పరిశోధనల్లో కనిపించిన ప్రభావం చాలా స్వల్పంగా ఉంది. ఆహారంలో మార్పులు లేకుండా కేవలం వైబ్రేషన్ థెరపీతో పొట్ట కొవ్వులో చెప్పుకోదగ్గ తగ్గుదల కనిపించలేదు.
సౌనా బెల్టుతో చెమట పడితే..
ఇది మరో అపోహ. సౌనా లేదా హీట్ బెల్టులు పొట్ట ప్రాంతాన్ని వేడెక్కించి చెమట పట్టిస్తాయి. దీంతో కొద్దిసేపు బరువు తగ్గినట్లు కనిపించవచ్చు. కానీ అది కొవ్వు తగ్గడం కాదు.. శరీరంలోని నీరు తగ్గడం. నీరు తాగిన తర్వాత ఆ బరువు మళ్లీ పెరుగుతుంది.
మరి పొట్ట కొవ్వు తగ్గాలంటే?
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ప్రత్యేకమైన మెషీన్ కంటే మొత్తం శరీరంలో కొవ్వు తగ్గించే విధానం ముఖ్యం. అవసరమైన దానికంటే కొద్దిగా తక్కువ క్యాలరీలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్ వంటి పెద్ద కండరాలను పనిచేయించే వ్యాయామాలు చేయాలి. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలి. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.