భర్తను చంపి, పొట్ట చీల్చి.. ఇంటి ఓనర్ చూడటంతో టెర్రస్‌పై నుంచి దూకేసింది!
- కురుక్షేత్రలో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య
- పొట్ట చీల్చి, పేగులను సంచిలో నింపుతుండగా చూసిన ఇంటి యజమాని
- అడ్డంగా దొరకడంతో టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
- మృతుడి శరీరం నుంచి కాలేయం, కిడ్నీ మాయమైనట్టు గుర్తింపు
- హత్య వెనుక క్షుద్రపూజల కోణంపై పోలీసుల విచారణ
హర్యానాలోని కురుక్షేత్రలో అత్యంత దారుణమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఓ మహిళ, అతని శరీరాన్ని ఛిద్రం చేసింది. ఈ క్రమంలో ఇంటి యజమానికి అడ్డంగా దొరికిపోవడంతో భయంతో టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, పీహోవా రోడ్డులోని రాజ్ ప్యాలెస్ సమీపంలో రాజేశ్, విమలా దేవి దంపతులు ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేశ్ స్థానికంగా ఓ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారి ఇంట్లోంచి పెద్దగా అరుపులు వినిపించడంతో ఇంటి యజమాని రింకూ వారిని చూసేందుకు టెర్రస్‌పైకి వెళ్లాడు.
అక్కడ కనిపించిన దృశ్యం చూసి రింకూ షాక్‌కు గురయ్యాడు. రాజేశ్ రక్తపు మడుగులో పడి ఉండగా, అతని పొట్ట భాగం చీల్చి ఉంది. బయటకు వచ్చిన పేగులను విమల ఓ సంచిలో పెడుతుండటం అతను గమనించాడు. ఇంతలో తనను ఇంటి యజమాని చూశాడని గ్రహించిన విమల, కంగారుతో టెర్రస్‌పై నుంచి కిందికి దూకేసింది. గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజేశ్ పొట్టపై సుమారు 35 సెంటీమీటర్ల పొడవున కోసి ఉంది. అతని శరీరం నుంచి కాలేయంలో కొంత భాగం, కుడివైపు కిడ్నీ మాయమైనట్టు వైద్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో మూడు వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విమల క్షుద్రపూజలు, చేతబడి వంటివి చేస్తుండేదని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులకు పిల్లలు లేరు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విమల కోలుకుని వాంగ్మూలం ఇస్తేనే ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలు, అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.