రేవంత్ రాకతో తెలంగాణలో పొలిటికల్ హీట్.. సాయంత్రం ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి
- ముగిసిన రేవంత్‌రెడ్డి లండన్ పర్యటన
- కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్న సీఎం
- అమెరికా పర్యటనకు కేంద్రం మోకాలడ్డు
- కొండా కుమార్తె వ్యాఖ్యలతో పార్టీలో వివాదం
- సాయంత్రం ప్రెస్‌మీట్‌లో ఈ అంశాల ప్రస్తావన?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనుమతి నిరాకరించడంతో ఆయన తన పర్యటనను కుదించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన రాష్ట్రానికి దూరంగా ఉన్న సమయంలో పార్టీలో చెలరేగిన ‘కొండా ఎపిసోడ్’ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రాక, సాయంత్రం జరగబోయే మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 20న యూకే, యూఎస్ పర్యటనల కోసం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లారు. అక్కడ ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలతో పాటు లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలుగువారితో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు జరిపారు. అయితే, ఆయన అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందని లండన్‌లోనే స్పందించిన సీఎం, యువత భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు.
ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. పరకాల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో, ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తానన్న సీఎం ప్రకటనను సుష్మిత బహిరంగంగా సవాల్ చేశారు. "రేవంత్ రెడ్డి వచ్చినా, ఆయన తాత వచ్చినా పరకాలలో పోటీ చేసి గెలిచేది నేనే" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించి, మంత్రి కొండా సురేఖకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
ఈ రెండు కీలక పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకోవడంతో అందరి దృష్టి ఆయన స్పందనపైనే కేంద్రీకృతమైంది. సాయంత్రం జరగనున్న మీడియా సమావేశంలో అమెరికా పర్యటన రద్దు వెనుక కారణాలు, కొండా కుటుంబం వివాదంపై సీఎం ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.