షావుకారు జానకి కన్నుమూత.. పవన్ కల్యాణ్ సంతాపం

Sowcar Janaki passes away Pawan Kalyan expresses condolences
  • ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
  • దాదాపు 400 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారని కొనియాడిన పవన్ కల్యాణ్
  • షావుకారి జానకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ సినీ నటి షావుకారి జానకి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు.

షావుకారి జానకి సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆమె, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించి మెప్పించారని కొనియాడారు.

కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ఆమె ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. షావుకారి జానకి కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.
Advertisement
Sowcar Janaki
Pawan Kalyan
Sowcar Janaki Death
Veteran Actress
Janasena Party
South Indian Cinema

More Telugu News