తిరుమల అడవుల్లోకి ‘రోబో డాగ్’.. భక్తుల భద్రతకు టీటీడీ హైటెక్ సొల్యూషన్!
- తిరుమలలో వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణకు రోబో డాగ్
- భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికత పరిశీలన
- అడవుల్లోకి మనుషులు వెళ్లలేని చోట రోబోలతో నిఘా పెట్టే యోచన
- చిరుతల సంచారాన్ని గుర్తించి కంట్రోల్ రూమ్‌కు లైవ్ వీడియో, అలర్ట్స్
- శబ్దాలు, కాంతితో జంతువులను తిరిగి అడవిలోకి పంపే సౌకర్యం
శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడం, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో మనుషులకు బదులుగా నిఘా పెట్టేందుకు 'క్వాడ్రుపెడ్ రోబోట్' (నాలుగు కాళ్ల రోబో డాగ్) వినియోగంపై దృష్టి సారించింది.
గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ రోబో డాగ్ పనితీరును టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అటవీ, భద్రతా విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా మనుషులు సులభంగా వెళ్లలేని, ప్రమాదకరమైన కొండ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించడానికి ఈ రోబోట్‌ను ఎలా ఉపయోగించవచ్చో అడిగి తెలుసుకున్నారు.
రోబో ప్రత్యేకతలు ఇవే..
ఈ రోబో డాగ్ అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్ సెన్సార్ వంటివి ఉన్నాయి. వీటి సహాయంతో చిమ్మచీకటిలో, దట్టమైన పొగమంచులో కూడా వన్యప్రాణుల కదలికలను స్పష్టంగా గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థ సాయంతో ఇది జంతువులు, మనుషులు, వాహనాలను వేర్వేరుగా గుర్తుపట్టగలదు.
భక్తులకు భద్రత ఎలా?
గతంలో అలిపిరి-తిరుమల నడక మార్గాల్లో చిరుతల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నడకదారికి సమీపంలోని అటవీ ప్రాంతాల్లో చిరుత లేదా ఇతర జంతువుల కదలికలను ఈ రోబో గుర్తించిన వెంటనే, జియో-ట్యాగ్‌తో కూడిన హెచ్చరికను కంట్రోల్ రూమ్‌కు పంపుతుంది. అదే సమయంలో లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను భద్రతా సిబ్బందికి చేరవేస్తుంది. దీంతో వారు వెంటనే స్పందించి భక్తులను అప్రమత్తం చేయడానికి వీలవుతుంది.
అంతేకాకుండా, వన్యప్రాణులు భక్తులు తిరిగే ప్రాంతాల వైపు వస్తుంటే, రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి వాటిని భయపెట్టి, ఎలాంటి హాని తలపెట్టకుండా తిరిగి అడవిలోకి పంపే అవకాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఇది మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణను నివారిస్తుంది.
ఈ రోబోటిక్ వ్యవస్థను ఇప్పటికే ఉన్న కెమెరా ట్రాప్‌లు, ఫుట్ పెట్రోలింగ్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనపు బలంగా వినియోగించాలని టీటీడీ భావిస్తోంది. అవసరాన్ని బట్టి, జంతువుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీన్ని మొబైల్ మానిటరింగ్ యూనిట్‌గా మోహరించనున్నారు. దీని ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, వన్యప్రాణుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో భద్రతా చర్యలను మరింత మెరుగుపరచవచ్చని అధికారులు తెలిపారు.