అందుకే ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కూల్చాలనుకున్నా.. దర్యాప్తులో కో-పైలట్‌ సంచలన వాంగ్మూలం?

అందుకే ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కూల్చాలనుకున్నా.. దర్యాప్తులో కో-పైలట్‌ సంచలన వాంగ్మూలం?

Why I wanted to crash FlyDubai plane Co pilot sensational statement in investigation
  • గాజాపై దాడికి ప్రతీకారంగానే దాడి చేశానన్న కోపైలట్‌
  • దర్యాప్తులో ఈ విషయాన్ని చెప్పినట్లు కథనం
  • గతంలో ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన హమ్మామీ
  • అల్‌ఖైదా తీవ్రవాద భావజాలానికి ప్రభావితమైన హమ్మామీ
ఫ్లైదుబాయ్‌ విమానంలో కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఒమనీ కోపైలట్‌ హమామ్‌ అల్‌ హమ్మామీ తన చర్యకు కారణాన్ని వెల్లడించినట్లు సమాచారం. గాజాలో జరుగుతున్న పరిణామాలకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడ్డానని అతడు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు ఇజ్రాయెల్‌ వార్తా సంస్థ ‘మాకో’ తెలిపింది.

“గాజాకు ప్రతీకారంగా ఇలా చేశాను. అమరుడిగా చనిపోవాలనుకున్నాను” అని హమ్మామీ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే ఈ వాంగ్మూలానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు.

హమ్మామీ గతంలో ఒమన్‌ జాతీయ విమానయాన సంస్థలో పనిచేసినట్లు సమాచారం. తీవ్రవాద భావజాలంపై ఆందోళనల నేపథ్యంలో గతేడాది అతడిని సంస్థ నుంచి తొలగించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత అతడి పేరుతో ఉన్న సోషల్‌ మీడియా ఖాతాల్లో ఇజ్రాయెల్‌ విమానాలకు సంబంధించిన కాక్‌పిట్‌ వీడియోలు, అల్‌ఖైదా నేతల పోస్టులు కనిపించినట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది. హమ్మామీ తీవ్రవాద భావజాల ప్రభావానికి లోనై ఉండొచ్చని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గతంలో వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్‌ 30న ఫ్లైదుబాయ్‌ 1073 విమానం దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. విమానం ల్యాండింగ్‌కు గంటలోపే కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌పై హమ్మామీ దాడి చేశాడు. ఆ సమయంలో విమానం కొన్ని సెకన్లలోనే 17 వేల అడుగులకు పైగా కిందికి పడిపోయినట్లు విమాన ట్రాకింగ్‌ సమాచారం వెల్లడించింది.

తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్‌ దాడిని అడ్డుకున్నాడు. కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులకు లోపల జరుగుతున్న విషయం తెలిసింది. వారు కలిసి హమ్మామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్‌డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.
Advertisement
Hamam Al Hammami
FlyDubai
Gaza revenge attack
Captain Smith Macher
Dubai Tel Aviv flight
Flight 1073 incident

More Telugu News