తెలుగు రాష్ట్రాల్లో సెలవు తేదీ మార్పు.. మిలాద్ ఉన్ నబీ ఎప్పుడంటే..?
- ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు
- గతంలో ఆగస్టు 25న సెలవుగా ప్రకటన
- తాజాగా ఆగస్టు 26, బుధవారానికి సెలవు మార్పు
- ముస్లిం మత పెద్దల అభ్యర్థన మేరకు నిర్ణయం
- తెలంగాణలోనూ ఆగస్టు 26నే మిలాద్ ఉన్ నబీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సెలవులకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. మిలాద్ ఉన్ నబీ పండగ సెలవు తేదీని ప్రభుత్వం సవరించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 25న సెలవు ఉండగా.. తాజాగా దాన్ని ఆగస్టు 26వ తేదీకి మార్చింది.
ముస్లిం మత పెద్దల అభ్యర్థన, నూతన చంద్ర దర్శనాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మార్పు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సవరించిన ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ఆగస్టు 25న మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడేగా పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం ఆ తేదీని సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 26, బుధవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వ సెలవు అమల్లో ఉంటుంది. దీంతో గతంలో ఆగస్టు 25న ప్రకటించిన సెలవు తేదీ మారినట్లయింది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా మిలాద్ ఉన్ నబీ సెలవును ఆగస్టు 26నే ఖరారు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన ఈ పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు అమలు కానుంది.