వరుస సెలవులు.. తిరుమలలో భారీ రద్దీ.. దర్శనానికి సుదీర్ఘ నిరీక్షణ
- తిరుమలకు పోటెత్తిన భక్తులు
- శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం
- నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు
- శనివారం 90 వేల మందికి పైగా స్వామివారి దర్శనం
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల గిరులు భక్తజనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 22 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు వెలుపలికి కిలోమీటర్ల మేర విస్తరించాయి. రద్దీ పరిస్థితులను టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందజేస్తున్నారు.
శనివారం (ఆగస్టు 15న) ఒక్కరోజే స్వామివారిని 90,293 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 53,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.