‘ఇంకా ఎప్పుడు ఎదుగుతావ్ రాహుల్?’.. కాంగ్రెస్ అగ్రనేత ‘హగ్’ జోక్‌పై బీజేపీ ఫైర్
- మోదీ విదేశాంగ విధానం ‘ఆలింగనాలకే’ పరిమితమైందన్న రాహుల్
- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు
- ‘ఎప్పుడు ఎదుగుతావ్?’ అంటూ ప్రహ్లాద్ జోషి కౌంటర్
- ప్రతిపక్ష నేత హోదాకు ఆ భాష తగదన్న బాన్సురీ స్వరాజ్
- రాహుల్ వ్యాఖ్యలు రాజకీయ చర్చ స్థాయిని దిగజార్చాయన్న బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించాల్సిన తీరును మరిచిపోయారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
గురువారం నిర్వహించిన కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విదేశాంగ విధానంపై ప్రధాని మోదీకి ఉన్న అవగాహన విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడానికే పరిమితమైందన్నట్లుగా వ్యాఖ్యానించారు. వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకుని తన వ్యాఖ్యలను హాస్యంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘జోకర్ల గుంపు’గా కూడా అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలపై ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు. “రాహుల్ గాంధీ.. ఎప్పుడు ఎదుగుతారు?” అని వ్యగ్యంగా ప్రశ్నించారు. దేశాన్ని నడిపించడానికి పరిణతి చెందిన నాయకత్వం అవసరమని, ‘జోకర్స్, క్లౌన్స్’ వంటి పదాలు ఉపయోగించడం ఆయన రాజకీయ అపరిపక్వతను చూపిస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడని జోషి పేర్కొన్నారు. కుటుంబ వారసత్వం ద్వారా మోదీ ప్రధాని కాలేదని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రధానిని మాత్రమే కాకుండా దేశ ప్రజలను కూడా అవమానించేలా ఉన్నాయని విమర్శించారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నాయని అన్నారు. రాహుల్ ప్రవర్తనపై సోనియా గాంధీ జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ కూడా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రధాని మోదీపై ఆయన ఉపయోగించిన భాష లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదాకు తగదన్నారు. దేశానికి నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరమని, సోషల్ మీడియా మీమ్స్, రీల్స్ కోసం చౌకబారు వ్యాఖ్యలు చేసే తీరు కాదని విమర్శించారు.
కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ సైతం రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చ స్థాయిని మరింత దిగజార్చాయని పేర్కొన్నారు.