గంజాయి ముఠాతో పోలీసుల చెట్టపట్టాల్.. బాలానగర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- బాలానగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ముఠాపై ఈగల్ పోలీసుల దాడి
- పోలీసులపై కుక్కలను ఉసిగొల్పి స్క్రూడ్రైవర్‌తో దాడి చేసిన నిందితులు
- నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, 14.5 కిలోల గంజాయి స్వాధీనం
- గంజాయి ముఠాతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడి
హైదరాబాద్‌లోని బాలానగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై నిందితులు ఎదురుదాడికి దిగారు. కుక్కలను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తెలంగాణ ఈగల్ పోలీసులు సినీ ఫక్కీలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాతో స్థానిక పోలీసులకు దగ్గరి సంబంధాలు ఉన్నట్టు తేలడం సంచలనం రేపుతోంది.
ఏపీలోని పాడేరుకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు బాలానగర్‌ను కేంద్రంగా చేసుకుని గంజాయి దందా నడుపుతున్నారు. క్యాటరింగ్ ముసుగులో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తెచ్చి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఈగల్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి నిందితుల ఇంటిపై దాడి చేశారు. పోలీసులను గమనించిన నిందితులు వారిపైకి కుక్కలను వదిలారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు.
ఇంతలో కిరణ్ అనే నిందితుడు ఓ ఇన్‌స్పెక్టర్‌ను స్క్రూడ్రైవర్‌తో పొడిచి భవనాలపైకి దూకుతూ పారిపోయే ప్రయత్నం చేశాడు. మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌పైకి ఎక్కి, సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కిందకు దూకడంతో గాయపడిన అతడిని పోలీసులు పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. అతడి భార్య హారికను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14.5 కిలోల గంజాయి, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో గంజాయి ముఠాతో బాలానగర్ ఠాణాకు చెందిన ఓ ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లకు సంబంధాలున్నట్లు తేలింది. ఈగల్ పోలీసుల దాడికి కొన్ని నిమిషాల ముందే ఓ కానిస్టేబుల్ నిందితుల ఇంటికి వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. నిందితుల ఇంట్లో పోలీసులకు చెందిన వైర్‌లెస్ సెట్ పరికరం (మ్యాన్‌ప్యాక్) కూడా లభించడం కలకలం రేపుతోంది. ఈ ముఠాకు 200 మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 100 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని పరీక్షించగా వారిలో 72 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.