జైల్లో రేపు విరూపాక్షిని పరామర్శించనున్న జగన్
- ఇటీవల అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న ఆలూరు మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి
- జైలుకు వెళ్లి పరామర్శించనున్న జగన్
- విరూపాక్షి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్న వైసీపీ అధినేత
వైసీపీ అధినేత జగన్ రేపు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న ఆలూరు మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు, వారికి అండగా నిలిచేందుకు జగన్ ఈ పర్యటన చేపడుతున్నారు.
పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లా జైలులో ఉన్న పార్టీ నాయకులను జగన్ పరామర్శించనున్నారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పబోతున్నారు. వైసీపీ శ్రేణులకు ఏ చిన్న కష్టం వచ్చినా వైసీపీ అగ్రనాయకత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని... చట్టపరంగా, పోరాటాల ద్వారా ఈ కక్షసాధింపు చర్యలను తిప్పికొడతామని చెప్పడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.