ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు.. త్రిష పేరును ప్రస్తావించిన అన్నాడీఎంకే నేత

ADMK leader drags Trisha into criticism against Chief Minister Vijay
  • ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని నటి త్రిషపై ఉదయకుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
  • త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారంటూ వ్యాఖ్య
  • ఉదయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయకుమార్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ‘‘ముఖ్యమంత్రికి ఇష్టమైన నటి త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సైతం త్రిష పేరును ప్రస్తావించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఉదయకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కావేరీ జలాల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శిస్తూ, "విజయ్‌కు ప్రియమైన త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారో చూడాలని తమిళనాడు ఎదురుచూస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు చెందిన అర్చనా కళాపతిని ఓ ప్రభుత్వ కమిటీలో నియమించిన నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.

ఉదయకుమార్‌ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధురైలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మరోవైపు, ముఖ్యమంత్రిని, నటి త్రిషను కించపరిచేలా మాట్లాడిన ఉదయకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తూత్తుకుడిలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి విజయ్‌పై రాజకీయ దాడిలో భాగంగా త్రిష పేరును వాడటం ఇది రెండోసారి. గతవారం తంజావూరులో జరిగిన నిరసనలో ఉదయనిధి స్టాలిన్ కూడా త్రిష పేరును ప్రస్తావించగా, టీవీకే మహిళా విభాగం ఆయనపై ఫిర్యాదు చేసింది. అయితే తాను కేవలం నీటి సమస్య గురించే మాట్లాడానని ఆయన అనంతరం వివరణ ఇచ్చారు.
Advertisement
Vijay
RB Udhayakumar
Trisha
ADMK

More Telugu News