తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి.. 73 లక్షల ఓట్లు పోయినట్టే

Telangana SIR process complete 73 lakh votes likely to be removed
  • తెలంగాణలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ప్రాథమిక అంచనా
  • ఇప్పటి వరకు 2.64 కోట్ల ఎస్ఐఆర్ ఫామ్ ల డిజిటలైజేషన్ పూర్తి
  • జాడ తెలియని ఓటర్ల సంఖ్య 11.25 లక్షలు

తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ భారీ సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారు. సేకరించిన సమాచారంలో ఇప్పటి వరకు దాదాపు 2.64 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ పూర్తి చేయగా, నమోదు ప్రక్రియ 78.30 శాతానికి చేరింది. అయితే ఈ నమోదు సరళిని గమనిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఓటర్ల జాబితా స్వరూపమే మారిపోనుందని స్పష్టమవుతోంది.


మరోవైపు, క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులకు సవాలుగా మారిన అనేక అంశాలు వెలుగుచూశాయి. మొత్తం 73.39 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను (21.70 శాతం) వివిధ కారణాల వల్ల సేకరించలేకపోయినట్లు అధికారులు ‘అన్‌కలెక్టబుల్’గా వర్గీకరించారు. ఇందులో అత్యధికంగా 45.18 లక్షల మంది ఓటర్లు తమ నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు గుర్తించగా, 9.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు నమోదైంది. మరో 11.25 లక్షల మంది అసలు జాడ తేలక అడ్రస్ దొరకని స్థితిలో ఉండగా, 6.70 లక్షల మందికిపైగా ఇప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ భారీ వ్యత్యాసాలు, వలసల గణాంకాల నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ఊహించని పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Advertisement
Telangana Voter List
SIR enumeration process
Telangana Election Commission
Voter list revision
Migrated voters Telangana
Special Summary Revision

More Telugu News