జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాదం.. బస్సు కింద నలిగి మెకానిక్ మృతి
- జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం
- బస్సు బ్రేకులు బాగుచేస్తుండగా ఘటన
- సంతోష్ కుమార్ అనే మెకానిక్ అక్కడికక్కడే మృతి
- బస్సును డ్రైవర్ ముందుకు కదపడంతో దుర్ఘటన
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఓ ఉద్యోగి, అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో డిపోలో విషాదఛాయలు అలముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ (39), ఓ ఆర్టీసీ బస్సు బ్రేకుల్లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు వెళ్లారు. ఆయన బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న విషయాన్ని గమనించని డ్రైవర్, ఒక్కసారిగా బస్సును ముందుకు కదిపారు. దీంతో సంతోష్ కుమార్ బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తోటి ఉద్యోగి ఆకస్మిక మరణంతో డిపో సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.