ట్రాఫిక్‌లో చిక్కుకున్న పైలట్.. గంటపాటు విమానంలోనే 175 మంది ప్రయాణికులు!
- ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న పైలట్
- ఇండిగో తీరుపై ఎంపీ హనుమాన్ బెనివాల్ తీవ్ర ఆగ్రహం
- మరో పైలట్‌ను రప్పించి ఆలస్యంగా విమానం టేకాఫ్
ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఊహించని అవాంతరం ఎదురైంది. పైలట్ సమయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో, 175 మందికి పైగా ప్రయాణికులు దాదాపు గంటపాటు విమానంలోనే వేచి చూడాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ వల్లే పైలట్ ఆలస్యంగా వచ్చినట్లు తెలిసింది.
ఇండిగో విమానం 6E 6131 శుక్రవారం రాత్రి 8:20 గంటలకు ఢిల్లీలోని టెర్మినల్ 1 నుంచి బయలుదేరాలి. అయితే, పైలట్ రాకపోవడంతో విమానం రాత్రి 9:09 గంటలకు టేకాఫ్ అయింది. ఈ విమానంలో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ హనుమాన్ బెనివాల్ కూడా ఉన్నారు.
ఈ ఘటనపై ఎంపీ బెనివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఢిల్లీలో వాతావరణం, ట్రాఫిక్ సమస్యలను ఊహించే నేను ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాను. మరి పైలట్ ఎందుకు ముందుగా రాలేదు? ప్రయాణికులందరూ కూర్చున్న తర్వాత కూడా విమానం కదలకపోవడంతో సిబ్బందిని అడగ్గా, పైలట్ ఇంకా రాలేదని చెప్పారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని ఆయన అన్నారు. ప్రయాణికులు ఆలస్యంగా వస్తే విమానం గంటపాటు ఆగుతుందా? అని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ విషయంలో ఇండిగోను బాధ్యుల్ని చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు.
చివరకు మరో ఇండిగో విమానం ఢిల్లీకి చేరుకున్నాక, దాని పైలట్‌ను ఈ విమానం నడిపేందుకు పంపించారని బెనివాల్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో, భారీ వర్షాల కారణంగా నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయని, ఈ ఊహించని పరిస్థితుల వల్లే విమానం ఆలస్యమైందని పేర్కొంది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నామని వివరణ ఇచ్చింది.