సోషల్ మీడియాకు 'ప్రేమలు' బ్యూటీ గుడ్ బై.. ప్రశాంతతే ముఖ్యమన్న మమితా!

Premalu Beauty Good Bye To Social Media
  • మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం
  • ఇకపై తన అప్‌డేట్స్ అన్నీ పీఆర్ టీమ్ చూసుకుంటుందని వెల్లడి
  • తాను అల్లు అర్జున్‌కు వీరాభిమానినని చెప్పిన మలయాళ బ్యూటీ
  • సూర్యతో పాటు మూడు భాషల్లో సినిమాలు చేస్తున్నట్లు వెల్లడి
‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటి మమితా బైజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతే తనకు ముఖ్యమని, అందుకే ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్‌డేట్స్ పంచుకోనని స్పష్టం చేశారు. తన సినిమాలకు సంబంధించిన అన్ని వివరాలు పీఆర్ టీమ్ ద్వారానే వెల్లడవుతాయని తెలిపారు.

ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలతో పాటు పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమానినని, ఆయన సినిమాలను పదిసార్లకు పైగా చూస్తానని చెప్పారు. ముఖ్యంగా ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో ఆయన ధరించిన క్యాసియో వాచ్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ స్టైల్‌ను తాను కూడా కాపీ కొట్టేదాన్నని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.

కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమితా తండ్రి డాక్టర్ కాగా, ఆమె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. తన అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్ అని, తన జీవితంలో అన్ని ముఖ్య నిర్ణయాలు, చివరికి పెళ్లి విషయం కూడా అన్నయ్యే చూసుకుంటాడని తెలిపారు. తనకు వచ్చే లవ్ ప్రపోజల్స్‌ను కూడా అతనే డీల్ చేస్తాడని చెప్పి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో పాటు మూడు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు మమితా బైజు వివరించారు.
Advertisement
Premalu
Social Media
Tollywood
Mamitha Baiju

More Telugu News