హర్మూజ్‌పై అమెరికా తన పద్ధతి మార్చుకోవాల్సిందే: ఇరాన్
- అమెరికా వైఖరి మార్చుకోనంత వరకు హర్మూజ్ తెరుచుకోదన్న ఇరాన్
- ఆంక్షలు ఎత్తివేసి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
- హర్మూజ్ తెరవాల్సిందేనన్న అమెరికా
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అమెరికా తన ధోరణిని మార్చుకుని, తమ డిమాండ్లను అంగీకరించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
అమెరికా తమపై బెదిరింపులకు పాల్పడటం ఆపాలని, నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. తమ దేశం నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఆర్థికంగా పరిహారం చెల్లించాలని షరతులు విధించింది. అలాగే, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులపై ఉన్న ఆంక్షలను బేషరతుగా ఎత్తివేయాలని కోరుతోంది.
జులైలో ఇరు దేశాల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం, ఆంక్షల తొలగింపు, నష్టపరిహారం వంటి అంశాలపై తుది ఒప్పందంలో చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలకు నిర్దేశించిన 60 రోజుల గడువు మరో వారంలో ముగియనుంది. అయితే, ముందుగా హర్మూజ్ జలసంధిని తెరవడంపై ఒప్పందం కుదిరితేనే మిగతా అంశాలపై చర్చిస్తామని అమెరికా పట్టుబట్టడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు, హర్మూజ్ జలసంధి నిర్వహణ కోసం ఒమన్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఇరాన్ వర్గాలు తెలిపాయి. రవాణా మార్గంపై త్వరలోనే ఏకాభిప్రాయం కుదరవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు.