కొనసాగుతున్న బంగారం జోరు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలివే

Gold surge continues latest prices in Telugu states
  • వరుసగా నాలుగో రోజు పెరిగిన బంగారం ధరలు
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పసిడికి పెరుగుతున్న డిమాండ్
  • నాలుగు రోజుల్లో తులంపై రూ.8,000కు పైగా పెరుగుదల
  • హైదరాబాద్‌లో రూ.1.52 లక్షలు దాటిన 24 క్యారెట్ల బంగారం
దేశవ్యాప్తంగా పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ సంకేతాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారంపై మదుపరులు మొగ్గు చూపుతున్నారు. దీంతో పెరిగిన డిమాండ్ కారణంగా ధరలు పరుగులు పెడుతున్నాయి.

గత నాలుగు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 8 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఆగస్టు 5న రూ. 1,44,000 వద్ద ఉన్న ధర, ఆదివారం ఉదయానికి రూ. 1.52 లక్షల మార్కును దాటింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. ఆదివారం ఉదయం నాటికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,350గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,39,650గా నమోదైంది. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ. 1,52,380గా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం ధర రూ. 1,52,550 పలుకుతుండగా, ముంబై, బెంగళూరు నగరాల్లో రూ. 1,52,350గా ఉంది. చెన్నైలో మాత్రం ఈ ధర కొంత తక్కువగా రూ. 1,51,640 వద్ద ట్రేడ్ అవుతోంది.                                
Advertisement
Gold Price
Hyderabad Gold Rates
Andhra Pradesh Gold Price
24 Carat Gold
Bullion Market
Gold Rate Hike

More Telugu News