గ్లోబల్ ఐటీ మ్యాప్‌పై విశాఖ.. 'ఐబీఎం ఫ్యూచర్ నౌ' సెంటర్ ప్రారంభించిన మంత్రి లోకేశ్
- విశాఖలో ఐబీఎం కొత్త ఆఫీస్
- ప్రపంచవ్యాప్త ఏఐ, డిజిటల్ సేవలకు ఈ కేంద్రం సపోర్ట్
- ఏపీ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యమని ప్రభుత్వం వెల్లడి
- భారత్ టెక్నాలజీ ప్రస్థానంలో ఇది కీలకమన్న ఐబీఎం ఇండియా ఎండీ
- విశాఖ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తామన్న ఐబీఎం
విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం (IBM), తన నూతన 'ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్'ను విశాఖలో ఘనంగా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఇసుకతోట జంక్షన్‌లో ఉన్న లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఏఐ గవర్నెన్స్ ఇంటిలిజెన్స్, కెమికల్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ ఆపరేషన్స్ వంటి విభాగాల గురించి మంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఈ ఫ్యూచర్‌నౌ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐబీఎం ఖాతాదారులకు కన్సల్టింగ్ సేవలు, ఏఐ-ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తుంది. భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధిపై ఐబీఎం పెడుతున్న పెట్టుబడులలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. కృత్రిమ మేధస్సు (AI), హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా & అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో ఈ కేంద్రం సేవలు అందించనుంది.
భవిష్యత్ అవసరాలకు తగ్గ వర్క్‌ఫోర్స్ నిర్మాణం
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కేంద్రాలలో ఆవిష్కరణలు, సేవల సామర్థ్యాలను విస్తరించాలనే ఐబీఎం వ్యూహానికి ఈ సెంటర్ నిదర్శనంగా నిలుస్తోంది. అపారమైన సాంకేతిక ప్రతిభ, బలమైన విద్యాసంస్థలు, వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థతో విశాఖపట్నం, గ్లోబల్ ఖాతాదారుల అవసరాలను తీర్చగల కీలక కేంద్రంగా ఎదుగుతోంది. ఈ సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు తగిన సాంకేతిక నైపుణ్యాలున్న మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం ఆవిర్భవించడానికి ఐబీఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ ఎంతగానో దోహదపడుతుంది. మా లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడం కాదు, నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడం, ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేలా ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే. ఏపీ పట్ల ఐబీఎం చూపుతున్న నిబద్ధతను స్వాగతిస్తున్నాం. విశాఖను ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం దేశంలోని అగ్రగామి కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి ఐబీఎంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం" అని అన్నారు.
ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ, "వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగంగా, డిజిటల్ యుగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే అపూర్వ అవకాశం భారతదేశానికి ఉంది. ప్రతిభ, ఆవిష్కరణలు, సాంకేతిక సామర్థ్యాలను సమన్వయం చేసుకుని ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. విశాఖపట్నంలోని మా ఫ్యూచర్‌నౌ సెంటర్, ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, సాంకేతిక సేవల కేంద్రంగా భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది" అని తెలిపారు.
ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్ ఇండియా మేనేజింగ్ పార్ట్‌నర్ ఉషా శ్రీకాంత్ మాట్లాడుతూ, "విశాఖపట్నంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రతిభ, బలమైన విద్యాసంస్థలు, టెక్నాలజీ ఎకోసిస్టమ్ వల్ల ఇది ప్రపంచ ఖాతాదారుల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరాలకు మద్దతు ఇచ్చే కీలక కేంద్రంగా మారుతోంది. స్థానిక ప్రతిభను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో సమన్వయం చేసి, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం" అని వివరించారు.
ప్రస్తుతం ఐబీఎం కన్సల్టింగ్, విశాఖపట్నంతో కలిపి భారతదేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గురుగ్రామ్, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, పుణె సహా 15 నగరాల్లో ఫ్యూచర్‌నౌ సెంటర్లను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐబీఎం సిబ్బందితో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా మాట్లాడి, అందరూ గర్వపడేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.