ఎన్నికల రాజకీయాల్లోకి కాక్రోచ్ పార్టీ? స్పష్టతనిచ్చిన అభిజిత్ దీప్కే
- సీజేపీ బలోపేతమే తొలి లక్ష్యమన్న దీప్కే
- వాలంటీర్లతో సమీక్ష తర్వాత భవిష్యత్ కార్యాచరణ
- ప్రజల్లో భయం పోవడమే ఉద్యమ అసలు విజయం
- ఎన్నికల రాజకీయాలపై ప్రస్తుతం ఆసక్తి లేదని స్పష్టీకరణ
- ప్రజా ఉద్యమాలే ప్రజాస్వామ్యానికి బలమని అభిప్రాయం
- నిరుద్యోగం, విద్య రాజకీయ అంశాలేనని వ్యాఖ్య
ఢిల్లీ విద్యార్థుల ఆందోళన తర్వాత తమ తొలి లక్ష్యం సంస్థను మరింత బలోపేతం చేయడమేనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెప్పారు. ఉద్యమం ఆరంభంలో తమతో 10 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారని, ఇప్పుడు వాలంటీర్ల సంఖ్య 300 దాటిందని తెలిపారు. ముందుగా వారందరితో సమావేశమై ఉద్యమంలో జరిగిన లోపాలు, మెరుగుపర్చాల్సిన అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. ఆ తర్వాతే సంస్థ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే తమ ఉద్యమం అతిపెద్ద విజయం కాదని దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ప్రజల్లో పెరగడం, తమ హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడే స్ఫూర్తి రావడమే నిజమైన విజయమని అన్నారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు చర్యలు, కేసులు, జైలు భయం ఉండేదని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు వినిపిస్తే ప్రభుత్వం స్పందించాలని దీప్కే అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించాలని కోరినప్పుడు ఆ డిమాండ్‌ను ప్రభుత్వం గౌరవించాల్సిందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినప్పుడు ప్రజా ఒత్తిడి తీసుకొచ్చే ఉద్యమాలే అవసరమని చెప్పారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో కూడా ప్రజా ఉద్యమాలే కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు.
నిరుద్యోగం, విద్య వంటి అంశాలు కూడా రాజకీయ నిర్ణయాలతో ముడిపడి ఉంటాయని దీప్కే అన్నారు. పార్లమెంట్‌లో తీసుకునే నిర్ణయాల ప్రభావం ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ఉంటుందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడ విద్యకు సంబంధించిన సమస్య తలెత్తినా తమ సంస్థ విద్యార్థులకు అండగా ఉంటుందని దీప్కే చెప్పారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటోందని, విద్యార్థుల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. అలాంటి ప్రతి సమస్యపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.