పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పెమ్మసాని
- పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూత
- రైతుకు రూ. 50,000 వడ్డీలేని రుణం ప్రకటించిన కేంద్రం
- లో, ఆఫ్-స్టైల్ రకాలకు కేజీకి రూ. 10 రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం
- వివిధ రకాల పొగాకుకు కనీస కొనుగోలు ధరల ఖరారు
పొగాకు రైతులకు ఊరటనిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 45,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతి రైతుకు రూ. 50 వేల చొప్పున వడ్డీలేని రుణాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రుణాన్ని రెండేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 250 కోట్లు కేటాయించింది. దీనికి అదనంగా, 'లో' (Low), 'ఆఫ్-స్టైల్' (Off-style) రకాల పొగాకుకు కిలోకు రూ. 10 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుందని, ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుందని వివరించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ. 100 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు.
పొగాకు ఎగుమతిదారులు సైతం కనీస కొనుగోలు ధరలకు అంగీకరించారని పెమ్మసాని పేర్కొన్నారు. దీని ప్రకారం.. బ్రైట్ రకం కిలోకు రూ. 230, మీడియం రకం రూ. 190, లో రకం రూ. 110 మరియు ఆఫ్-స్టైల్ రకం రూ. 130గా ధరలను నిర్ణయించారు. ఈ సహాయక చర్యలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది తమ కూటమి ప్రభుత్వం రూ. 146 కోట్ల విలువైన బ్లాక్ బర్లీ పొగాకును కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.