పాక్‌లో శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి.. ఏడుగురి మృతి
- మరో 18 మందికి పైగా గాయాలు
- ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ జిల్లాలో ఘటన
- శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానికుల ర్యాలీ
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. శాంతిని కోరుతూ ప్రజలు చేపట్టిన ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ జిల్లాలో జరిగిందీ ఘటన.
తమ ప్రాంతంలో పెరుగుతున్న హింసాకాండను నిరసిస్తూ, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన కొనసాగుతుండగానే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భీతావహంగా మారింది.
సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించాయి. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలపై ఉన్నతాధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.