ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం: ప్యాసింజర్ ఫెర్రీలో మంటలు చెలరేగి ఐదుగురి మృతి

Indonesia Ferry Fire 5 Dead and 41 Missing in Passenger Ferry Accident
  • ఘటనలో మరో 41 మంది గల్లంతు
  • 225 మందిని సురక్షితంగా కాపాడిన సహాయక బృందాలు
  • మదురా దీవి సమీపంలో ఘటన
  • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది గల్లంతయ్యారు. మదురా దీవి సమీపంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

‘కెఎంపీ ముతియారా సెంటోసా-2’ అనే ప్యాసింజర్ ఫెర్రీ ఆదివారం ఉదయం సురబాయలోని తంజుంగ్ పెరాక్ పోర్ట్ నుంచి దక్షిణ సులవేసిలోని మకస్సర్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో మదురా దీవి సమీపానికి చేరుకోగానే పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే సురబాయ సెర్చ్, రెస్క్యూ కార్యాలయ అధికారులు, సమీపంలోని ఇతర నౌకల్లోని సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదం నుంచి ఇప్పటివరకు 225 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చాయి. ఐదు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మిగతా 41 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.                             
Advertisement
Indonesia Ferry Fire
KMP Mutiara Sentosa 2
Madura Island Accident
Surabaya to Makassar
Indonesia Boat Disaster
Passenger Ship Fire

More Telugu News