బోనాలను గతంలో పట్టించుకోలేదు.. కేసీఆర్ వల్లే బోనాలకు రాష్ట్ర పండుగ హోదా: కేటీఆర్

KTR says Bonalu got state festival status only because of KCR
  • సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్
  • గత ప్రభుత్వాలు బోనాలను గుర్తించలేదని విమర్శ
  • కేసీఆర్ పాలనలోనే బోనాలకు రాష్ట్ర పండుగ హోదా వ‌చ్చింద‌న్న మాజీ మంత్రి
  • వర్షాలు బాగా పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించిన‌ట్లు వెల్ల‌డి
నేడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బోనాలు కులాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో బోనాల పండుగను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, రాష్ట్ర పండుగగా గుర్తించలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. అమ్మవారి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గుడికి రూ.25 కోట్లు కేటాయించి, పండుగలను ఘనంగా నిర్వహించామని తెలిపారు.

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో పచ్చగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
KTR
Bonalu Festival
Ujjaini Mahankali Temple
KCR
Telangana State Festival
Secunderabad Bonalu

More Telugu News