Advertisement

కాక్రోజ్ జనతా పార్టీ ఆర్థిక మూలాలపై విచారణ జరపాలి.. ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు

Cockroach Janata Party financial sources must be investigated says RTI activist
  • అభిజీత్ దీప్కే ఆర్థిక లావాదేవీలపై ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు
  • విదేశీ విద్యకు డబ్బు ఎక్కడిదని ప్రశ్న
  • ఆయన తండ్రి ఆర్థిక స్థితిపై విచారణకు డిమాండ్
  • కపిల్ సిబల్ ప్రకటించిన రూ. కోటి విరాళం చట్టబద్ధతపై అనుమానాలు
  • రిజిస్టర్ కాని పార్టీ నిధులు సేకరించడంపై ఎన్నికల సంఘానికి, పన్నుల విభాగానికి ఫిర్యాదు
కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే, ఆయన కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ పార్టీకి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించిన రూ. కోటి విరాళం చట్టబద్ధతపైనా ఆయన పలు అనుమానాలు లేవనెత్తారు.

అభిజీత్ దీప్కే తండ్రి భగవాన్‌రావు దీప్కే ఆర్థిక స్థితిపై దర్యాప్తు చేయాలని ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన భగవాన్‌రావు, తన కుమారుడిని విదేశాల్లో ఎలా చదివించగలిగారని ఆయన ప్రశ్నించారు. ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగికి అంత ఆర్థిక స్థోమత ఎలా వచ్చిందో పరిశీలించాలని తివారీ డిమాండ్ చేశారు.

మరోవైపు, నీట్ పేపర్ లీక్ వివాదంపై ఆందోళనలు చేసి అరెస్టయిన సీజీపీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించేందుకు కపిల్ సిబల్ రూ. కోటి లీగల్ డిఫెన్స్ ఫండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధుల సేకరణపై తివారీ ఎన్నికల సంఘానికి, పన్నుల శాఖకు ఫిర్యాదు చేశారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనేది రిజిస్టర్ కాని సంస్థ అని, అయినప్పటికీ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29ఎ ప్రకారం ఈ పార్టీకి ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలని తివారీ కోరారు. "ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకపోతే, రాజకీయ పార్టీ పేరుతో నిధులు సేకరించడంపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది" అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అమిత్ తివారీ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ)ను కూడా ఆశ్రయించారు. కపిల్ సిబల్ అందించే విరాళానికి జీఎస్టీ వర్తిస్తుందా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Abhijit Dipke
Cockroach Janata Party
Kapil Sibal
Amit Tiwari
NEET paper leak
Election Commission

More Telugu News