భూమికి ఆధార్ లాంటి ‘భూధార్’ నంబర్: మంత్రి పొంగులేటి
- గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి
- భూ అక్రమ లావాదేవీలపై త్వరలో ఫాస్ట్ ట్రాక్ విచారణ జరుపుతామని వెల్లడి
- ప్రతీ సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ‘భూధార్’ నంబర్ కేటాయిస్తామన్న పొంగులేటి
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధుల కొరత ఉండదని హామీ
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. పేదల భూములను అక్రమంగా చేజిక్కించుకున్న వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతంలోని ధరణి వ్యవస్థ నుంచి ప్రస్తుత ‘భూ భారతి’ వరకు జరిగిన ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలిస్తామని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం కొత్తగా ఒక్క అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్)లో చేర్చలేదని, గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన జాబితాపై ప్రస్తుతం సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 276 గ్రామాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో విశిష్ట ‘భూధార్’ నంబర్‌ను కేటాయించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
అసైన్డ్ భూముల సమస్యల శాశ్వత పరిష్కారానికి త్వరలోనే స్పష్టమైన, సమగ్రమైన విధానాన్ని తీసుకువస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యమైనప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు క్రమం తప్పకుండా చెల్లింపులు జరుపుతామని ఆయన భరోసా ఇచ్చారు.
భూముల విలువ సవరణ అనంతరం రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 10 నుంచి 20 శాతం మేర పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.18 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.