థియేటర్లలో మిస్సయితే జీ5లో మిస్ కాకండి: నాగార్జున
- ఓటీటీలోకి అఖిల్ అక్కినేని 'లెనిన్' చిత్రం
- ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్
- థియేటర్లలో అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా రికార్డు
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘లెనిన్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (ZEE5) వేదికగా ఈ సినిమా ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. "కొడుతున్నాం కాదు.. కొట్టేశాం అంతే! థియేటర్లలో మిస్ అయితే.. జీ5లో అస్సలు మిస్ అవ్వకండి" అనే ట్యాగ్‌లైన్‌తో జీ5 ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున విడుదల చేసిన ప్రత్యేక వీడియోను జీ5 తెలుగు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
"‘లెనిన్’ సినిమాను థియేటర్లలో ఆదరించి పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు మనోడు నేరుగా మీ ఇంటికి వచ్చేస్తున్నాడు. అక్కడ కూడా అలాగే ఆదరించండి, తప్పకుండా చూడండి" అంటూ నాగార్జున ఈ వీడియోలో విజ్ఞప్తి చేశారు.
జులై 10న థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ యాక్షన్ డ్రామా, అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అధిగమించినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ఈ సినిమాను వీక్షించలేకపోయిన ప్రేక్షకుల కోసం విడుదలైన నెల రోజులు గడవకముందే ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.