బెంగాల్‌లో జైషే ఉగ్రకుట్ర భగ్నం.. హనీట్రాప్‌తో నేతలు టార్గెట్!
- పశ్చిమ బెంగాల్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
- హనీట్రాప్‌తో నేతలే లక్ష్యంగా ఉగ్రవాదుల ప్లాన్
- జైషే మహ్మద్ ప్రమేయంపై పోలీసుల విచారణ
- కుట్రలో భాగమైన అర్పితా సర్కార్ అనే మహిళ అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ నేతలే లక్ష్యంగా పన్నిన భారీ ఉగ్ర కుట్రను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు భగ్నం చేశారు. హనీట్రాప్ ద్వారా నాయకుల నుంచి రహస్య సమాచారం సేకరించి, దాడులకు పాల్పడాలన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యూహాన్ని అధికారులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ?ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో అర్పితా సర్కార్ అనే మహిళను ఎస్‌టీఎఫ్ అధికారులు అరెస్టు చేశారు.
ఇటీవల జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై హమీమ్ మండల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఈ కుట్రకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. హమీమ్ మండల్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు అర్పితా సర్కార్‌ను గుర్తించారు. రాష్ట్రంలో ఉగ్ర దాడులు నిర్వహించేందుకు ఆమె సహకారంతో మండల్ ప్రణాళికలు రచించినట్లు ఎస్‌టీఎఫ్ అధికారులు విచారణలో ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు.