తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ.. మరోసారి గడువు పొడిగింపు
- ఆగస్టు 10 వరకు ఇంటింటి పరిశీలనకు అవకాశం
- హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నెమ్మదిగా సాగుతున్న సర్వే
- రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 77 శాతం ప్రక్రియ పూర్తి
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఇంటింటి పరిశీలన గడువును భారత ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఆగస్టు 3తో ముగియాల్సిన ఈ గడువును ఆగస్టు 10 వరకు పొడిగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 77.12 శాతం సర్వే పూర్తయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే, హైదరాబాద్ (56.31 శాతం), రంగారెడ్డి (63.43 శాతం), మేడ్చల్-మల్కాజ్‌గిరి (61.37 శాతం) వంటి కీలక జిల్లాల్లో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో గడువును పెంచాల్సి వచ్చింది.
ఈ సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి, ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్లను నిర్ధారించడం, నకిలీ ఓట్లను గుర్తించడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం వంటి పనులను చేపడుతున్నారు. ఓటర్ల జాబితా సవరణకు తొలుత జూలై 24ను తేది గడువుగా నిర్ణయించగా, దానిని ఆగస్టు 3కు పొడిగించారు. తాజాగా మరో వారం గడువు పెంచుతూ ఆగస్టు 10 వరకు అవకాశం కల్పించారు.