నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది: చిన్నికృష్ణ సెటైర్!
- బ్లాక్ బస్టర్ కథలను అందించిన చిన్నికృష్ణ
- తనకి గ్యాప్ రావడం గురించిన ప్రస్తావన
- లౌక్యం తెలిసి ఉండాలని వ్యాఖ్య
- తనకి ఓవరాక్టింగ్ రాదని వెల్లడి
- అశ్వనీదత్ తో ఎలాంటి గొడవాలేదని వివరణ
రచయితగా చిన్నికృష్ణకి మంచి పేరు ఉంది. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన వారాయన. ఆయన కథలను అందించిన సినిమాలు వసూళ్ల పరంగా కొత్త రికార్డులను తిరగరాశాయి. అలాంటి చిన్నికృష్ణ, తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "కెరియర్ పరంగా ఎదగాలనే అందరికీ ఉంటుంది. కాకపోతే ప్రతి దశలోనూ అణగదొక్కడమనేది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ నెగ్గుకు రావడం చాలా కష్టం. లౌక్యం తెలిసినవాళ్లు .. ఓవరాక్షన్ చేసేవాళ్లు .. బ్రతకనేర్చిన వాళ్లకి ఓకే. నాకు ఓవరాయాక్టింగ్ రాదు .. ప్రకృతి అది నాకు ఇవ్వలేదు' అని అన్నారు.
'అశ్వనీ దత్ గారికీ .. నాకు మధ్య ఏం జరిగిందని అడుగుతున్నారు. ఆయనకీ .. నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఎన్నో పెద్ద సినిమాలను నిర్మించిన గొప్ప నిర్మాత ఆయన. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో .. త్రివిక్రమ్ కథ - స్క్రీన్ ప్లేతో .. చిరంజీవిగారు హీరోగా దత్తుగారు 'జై చిరంజీవ' సినిమాను నిర్మించారు. ఆ సినిమా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అప్పుడు నేను వెంటనే దత్తుగారికి కాల్ చేసి అభినందించాను కూడా" అని ఆయన అన్నారు.
చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'జై చిరంజీవ' 2005లో విడుదలైంది. సమీరా రెడ్డి - భూమిక కథానాయికలుగా కనిపించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, పరాజయం పాలైంది. ఆ సినిమా విషయంలో తాను చేసిన ఒక పొరపాటే అందుకు కారణమని ఇటీవల ఒక సందర్భంలో విజయ్ భాస్కర్ ప్రస్తావించారు కూడా. ఒక ఫ్లాప్ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని చిన్నికృష్ణ చెప్పడం ఇక్కడ కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూ చూసినవాళ్లు, మొత్తానికి అప్పట్లో ఎక్కడో ఏదో తేడా కొట్టేసిందని అనుకునేలానే ఉంది మరి.