96 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారి.. హాఫ్-టైమ్ షోలో షకీరా, బిటిఎస్‌లతో కోల్డ్‌ప్లే ఊచకోత!
- అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఘనంగా ప్రారంభమైన ఫిఫా ముగింపు వేడుకలు
- న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో ప్రపంచ స్థాయి సంగీత తారల ప్రదర్శన
- ముగింపు వేడుకల్లో అలరించిన పోస్ట్ మలోన్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఐషోస్పీడ్, టామ్ క్రూజ్
- ప్రపంచకప్ చరిత్రలోనే మొదటిసారిగా ఫైనల్లో హాఫ్-టైమ్ షో ఏర్పాటు
- బిటిఎస్, జస్టిన్ బీబర్, షకీరాలతో కలిసి కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రదర్శన
ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ వేళ.. దానికి ముందు జరిగిన ముగింపు వేడుకలు స్టేడియాన్ని ఊపేశాయి. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం (న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం) వేదికగా ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో హాలీవుడ్ స్టార్లతో పాటు గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ స్టేజ్‌పై ఉర్రూతలూగించారు. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మహా సంగ్రామానికి ముందు ఈ మెగా ఈవెంట్ అభిమానులకు వినోదాన్ని పంచింది.
ఐషోస్పీడ్, పోస్ట్ మలోన్ లతో పాటు టామ్ క్రూజ్ రచ్చ!
అమెరికా జాతీయ గీతంతో జెన్నిఫర్ హడ్సన్ ఈ వేడుకలను ప్రారంభించారు. ఆ తర్వాత మెయిన్ పర్ఫామర్‌గా రంగంలోకి దిగిన గ్లోబల్ సింగర్ పోస్ట్ మలోన్ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఆయనతో పాటు రోబీ విలియమ్స్, నికోల్ షెర్జింగర్, లారా పౌసిని, ఇంటర్నెట్ సెన్సేషన్, యూట్యూబర్ 'ఐషోస్పీడ్' డ్యాన్స్, మ్యూజిక్ తో అదరగొట్టారు. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ కూడా ఈ వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. "ఈ ముగింపు వేడుకలు సంగీతం, సంస్కృతి, ఫుట్‌బాల్ కలయికతో సరికొత్త రికార్డు సృష్టించాయి" అని ఫిఫా సీవోవవో హీమో షిర్గీ, ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో సంతోషం వ్యక్తం చేశారు.
చరిత్రలో తొలిసారి
ప్రీ-మ్యాచ్ సెలబ్రేషన్స్ ఒక ఎత్తైతే.. ఫిఫా 96 ఏళ్ల చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి ఈ ఫైనల్ వేదికైంది. వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మ్యాచ్ మధ్యలో 'హాఫ్-టైమ్ షో'(విరామ సమయం)ను ఏర్పాటు చేశారు. కోల్డ్‌ప్లే బ్యాండ్ లీడర్ క్రిస్ మార్టిన్ నేతృత్వంలో రూపొందిన ఈ భారీ షోలో పాప్ సింగర్ జస్టిన్ బీబర్, పాప్ క్వీన్ మడోన్నా, లాటిన్ బ్యూటీ షకీరా, గ్లోబల్ సెన్సేషన్ బిటిఎస్ బ్యాండ్‌లు లైవ్ పర్ఫార్మెన్స్ లతో రచ్చ చేశారు. గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ మద్దతుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలు ఫుట్‌బాల్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేలా సాగాయి.