2027 నాటికి పోలవరం పూర్తి: గుడివాడ సభలో చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu Naidu Announces Polavaram Completion By 2027 At Gudivada Meeting
  • నేడు గుడివాడలో పర్యటించిన సీఎం చంద్రబాబు
  • పట్టిసీమను 12 నెలల రికార్డు కాలంలో పూర్తి చేశామన్న సీఎం
  • తల్లికి వందనం పిల్లలందరికీ వర్తింప చేస్తామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి వంద శాతం పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన ఆయన, అక్కడ జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' బహిరంగ సభలో మాట్లాడుతూ పోలవరం నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం అత్యంత శరవేగంగా ముందుకు తీసుకెళుతోందని ప్రకటించారు. గతంలో తాము కేవలం 12 నెలల రికార్డు కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారా ఏపీలో కరవు అనే మాటే లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.


ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై స్పందిస్తూ.. ఈ నెల నుంచే రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. కృష్ణా జిల్లాకు ఎంతో ఘనమైన చారిత్రాత్మక నేపథ్యం ఉందని కొనియాడిన ముఖ్యమంత్రి, అభివృద్ధిలోనూ ఈ ప్రాంతాన్ని ముందంజలో ఉంచుతామన్నారు. కేవలం ప్రాజెక్టులే కాకుండా నగరాలు, గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు 'చెత్త నుంచి సంపద సృష్టి' చేయడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement
Chandrababu Naidu
Polavaram Project
Gudivada Public Meeting
Thalliki Vandanam Scheme
Andhra Pradesh Development
Polavaram 2027 Deadline

More Telugu News