రాజకీయ పవర్ చూపిస్తే ఊరుకోం.. నడిరోడ్డుపై కాషాయ నేతకు దేహశుద్ధి!
- వృద్ధురాలి ఫ్లాట్‌ను కబ్జా చేసిన బీజేపీ నేత
- అగ్రిమెంట్ అయిపోయినా ఖాళీ చేయని వరుణ్ బిశ్వాస్
- పోలీసుల ముందే నేతపై తిరగబడ్డ స్థానికులు
- నడిరోడ్డుపై గుడ్లతో దాడి చేసిన ప్రజలు
- బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య నడిచే రాజకీయ సమరంలో సాధారణంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని జరిగే గుడ్ల దాడులు ఈసారి రివర్స్ అయ్యాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఒక వృద్ధురాలి ఫ్లాట్‌ను అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో న్యూటౌన్ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత వరుణ్ బిశ్వాస్‌ను స్థానిక ప్రజలు నడిరోడ్డుపై నిలదీశారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం ఆయనపై గుడ్లు విసురుతూ, దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించారు.
ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఫ్లాట్ వివాదం
పోలీసుల కథనం ప్రకారం.. న్యూటౌన్-రాజర్హట్ పరిధిలో ఒక వృద్ధురాలికి చెందిన ఫ్లాట్‌ను వరుణ్ బిశ్వాస్ 2018లో అద్దెకు తీసుకున్నారు. అయితే, అద్దె ఒప్పందం గడువు ముగిసిపోయినప్పటికీ, సదరు వృద్ధురాలు ఎన్నిసార్లు బతిమిలాడినా ఆయన ఫ్లాట్ ఖాళీ చేయడానికి నిరాకరించారు. తనకున్న రాజకీయ బలాన్ని చూపిస్తూ ఆమెను బెదిరింపులకు గురిచేశారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల ముందే ‘దొంగ దొంగ’ అంటూ దాడి
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వరుణ్ బిశ్వాస్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న స్థానికులు పోలీసుల వాహనాన్ని ముట్టడించారు. 'దొంగ, దొంగ' అంటూ నినాదాలు చేస్తూ వరుణ్ బిశ్వాస్‌పై గుడ్ల వర్షం కురిపించారు. పోలీసులు ఆయనను రక్షించి జీపులోకి ఎక్కించే క్రమంలో కొందరు జనం ఆయనపై దాడికి దిగారు. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం సదరు కాషాయ నేతను అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.