ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. బార్ల సమయం పొడిగింపు
- ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా హైదరాబాద్‌లో బార్ల వేళల పొడిగింపు
- ఫైనల్ మ్యాచ్ రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతి
- మూడో స్థానం మ్యాచ్ కోసం తెల్లవారుజాము 4:30 గంటల వరకు పర్మిషన్
- ఫుట్‌బాల్ అభిమానుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
- బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ అభ్యర్థనకు ఆమోదం
ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రపంచ కప్ ఫైనల్ పోరుతో పాటు మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌ల దృష్ట్యా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రో బ్రూవరీలను నిర్ణీత సమయం కంటే అదనంగా తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది.
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, జూలై 18 రాత్రి మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం సరఫరాకు వెసులుబాటు కల్పించారు. అలాగే, జూలై 19న అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య రాత్రి జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేందుకు అనుమతించారు.
ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లేదా ఆ తర్వాత ప్రారంభమవుతుండటంతో అభిమానులు తమ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులతో కలిసి బిగ్ స్క్రీన్లపై వీక్షించే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో బార్ల పనివేళలను పొడిగించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ జూలై 14న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖ తాజాగా అనుమతులు మంజూరు చేయగా, ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఫుట్‌బాల్ ప్రేమికులు స్నేహితులతో కలిసి బిగ్ స్క్రీన్‌లపై మ్యాచ్‌లను తిలకిస్తూ ఆనందించే అవకాశం లభించింది. అయితే, పొడిగించిన పనివేళల్లో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, భద్రతా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులు స్పష్టం చేశారు.