కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా... వీడియో ఇదిగో!
- తిరుమల విచ్చేసిన పవన్ కల్యాణ్ అర్ధాంగి
- అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమలకు
- ఆలయం వద్ద అన్నా లెజినోవాకు స్వాగతం పలికిన అధికారులు
- స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు.
తిరుమల చేరుకున్న అన్నాలెజినోవాకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇటీవల పవన్ కు ముంబైలో కుడి భుజం శస్త్రచికిత్స జరగడం తెలిసిందే. కొన్నిరోజుల కిందటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పవన్ హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కు విజయవంతంగా సర్జరీ జరిగిన నేపథ్యంలో, నేడు అన్నా లెజినోవా తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.