బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... రేపు ఏపీలో వర్షాలు

Low pressure continues in Bay of Bengal rains in AP tomorrow
  • ఏపీలో అల్పపీడన ప్రభావంతో వర్ష సూచన
  • రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు
  • కోస్తాంధ్రలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు శనివారం విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ప్రజలు చెట్ల కింద, పెద్ద హోర్డింగ్‌ల సమీపంలో నిలబడొద్దని సూచించారు. సముద్రం అలజడిగా ఉండి, అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లకపోవడం సురక్షితమని స్పష్టం చేశారు.
Advertisement
Low Pressure Area
Bay of Bengal
Andhra Pradesh Rains
APSDMA Weather Update
Coastal Andhra Rain Alert
Prakhar Jain

More Telugu News