మెక్సికోలో భారీ భూకంపం.. 7.3గా నమోదైన తీవ్రత
- మెక్సికో దక్షిణ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైన భూకంప తీవ్రత
- గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ వరకు కంపించిన భూమి
మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. చియాపాస్ తీరానికి సమీపంలోని అఖిలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశగా 48 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రధాన భూకంపానికి ముందు సముద్ర గర్భంలో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
భూకంప తీవ్రతకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. మెక్సికో, గ్వాటెమాలా సరిహద్దుల్లోని సుచియాటే నగరంలో సునామీ ముప్పు పొంచి ఉందనే అనుమానంతో తీర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మేయర్ ఎల్మర్ పేర్కొన్నారు. మెక్సికో దక్షిణ సరిహద్దులోని కీలక నగరమైన టపచులాలో తొలుత స్వల్పంగా ప్రారంభమైన ప్రకంపనలు, కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చాయి.
"మేము ఆసుపత్రిలోని రెండో అంతస్తులో ఉన్న సమయంలో భూమి కంపించడం మొదలైంది. తొలుత ఇది సాధారణ ప్రకంపనలే అని భావించాం, కానీ తీవ్రత పెరగడంతో అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చేశాం" అని ఓ ఉద్యోగిని అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధికి వివరించారు.
గ్వాటెమాలా సిటీలో భూప్రకంపనలు దీర్ఘకాలం పాటు కొనసాగడంతో జనం ఆందోళన చెందారు. మెక్సికో సిటీలోని పలు ప్రాంతాల్లో భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. అయితే, భూకంపం సంభవించిన ప్రారంభ క్షణాల్లో దాని తీవ్రత నిర్దేశిత పరిమితిని మించకపోవడం వల్ల ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ మోగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.