వ్యవసాయంపై లోకేశ్ కు కనీస అవగాహన లేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
- తాను చెప్పే ఐదు మొక్కల పేర్లు చెప్పాలని లోకేశ్ కి సవాల్
- పేర్లు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
- కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపణ
కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ పై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయంపై లోకేశ్ కు కనీస అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు తాను చూపించే ఏవైనా ఐదు వ్యవసాయ మొక్కల పేర్లను ఆయన సరిగ్గా చెబితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కాకాణి సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం దోపిడీయే పరమావధిగా పాలిస్తోందన్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరితే, ప్రస్తుతం చంద్రబాబు వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని కాకాణి దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో నిర్మించిన రామాయపట్నం పోర్టును ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే ఇందుకు నిదర్శనమని కాకాణి విమర్శించారు. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వకాల నుంచి నిరుద్యోగుల డీఎస్సీ నోటిఫికేషన్ వరకు ప్రతి ఒక్క విషయంలోనూ అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు.
ప్రతి పథకంలోనూ, ప్రభుత్వ నిర్ణయంలోనూ పారదర్శకత లోపించిందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వ్యవసాయ రంగం, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కాకాణి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.