వైసీపీ ప్రభుత్వం చేసిందే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది: షర్మిల
- అమ్మఒడి ఒక్క బిడ్డకే ఇచ్చి వైసీపీ మోసం చేసిందన్న షర్మిల
- కూటమి ప్రభుత్వం కూడా తల్లులను మోసం చేస్తోందని విమర్శ
- మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని డిమాండ్
కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. “తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ అంటూ ఆమె విమర్శించారు. అంతేకాదు గత ముఖ్యమంత్రి జగన్‌కి వారసుడు నేటి సీఎం చంద్రబాబు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. గత వైసీపీ మోసాలను తు.చ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ విధానమైందని మండిపడ్డారు.
అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం తల్లులను పచ్చిమోసం చేసిందని వ్యాఖ్యానించారు. “నీకు 15, నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు చంద్రబాబు తల్లులను నయవంచన చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కోతల రాయుడు కోతలంటూ జగన్ ను ఎద్దేవా చేసిన చంద్రబాబే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని విమర్శించారు.
తల్లికి వందనంపై నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 87 లక్షల మంది బిడ్డలకి ఇవ్వాల్నారు. కోతలు పెట్టకుండా ప్రతి బిడ్డకు 15 వేలు జమ చేయాలన్నారు. కొర్రీలు పెట్టకుండా మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో అమ్మఒడి పథకం కింద ఒక్కబిడ్డకే ఇచ్చి తల్లులను మోసం చేశారని... ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గం అనుసరిస్తోందని షర్మిల ఆరోపించారు. తల్లికి వందనం పథకం కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన హామీగా మిగిలిపోయిందని విమర్శించారు.