ఓటర్ల జాబితా సవరణ: తెలంగాణలో 60 శాతం డిజిటలైజేషన్ పూర్తి

Voter List Revision 60 Percent Digitalization Completed in Telangana
  • తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వేగవంతం
  • రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టు వెల్లడి
  • గ్రామీణ ప్రాంతాల్లో 80, పట్టణాల్లో 45 శాతం పురోగతి
  • సంగారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయిలో సమీక్షించిన ఎన్నికల కమిషనర్
  • గడువు పొడిగింపును దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశం
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఇప్పటివరకు 60 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పూర్తి కాగా, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మేర పురోగతి సాధించిందని ఆయన తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని సుల్తాన్‌పూర్, ఐలాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ప్రత్యేక సవరణ క్యాంపులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సవరణ ప్రక్రియ జరుగుతున్న తీరును బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు.

శిబిరాల వద్ద ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ మాట్లాడారు. వారికి పార్టీలు తరఫున గుర్తింపు కార్డులు జారీ అయ్యాయా అన్న అంశంపై ఆరా తీశారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు, బీఎల్ఓల సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పొడిగించిన గడువును దృష్టిలో ఉంచుకుని సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందుబాటులో లేని పక్షంలో, వాటిని వెంటనే సూపర్ వైజర్ల నుంచి సేకరించాలని ఆయన ఆదేశించారు.
Advertisement
Sudarshan Reddy
Telangana Voter List Revision
Election Commission of Telangana
Voter List Digitalization

More Telugu News